sankeerthanasanjeevani
http://www.youtube.com/watch?v=BF1mbCnCYtw
ఈ కీర్తన ఇటీవల విడుదల చేసిన నాఆల్బమ్ సంకీర్తనా సంజీవని లోనిది.
Add comment ఆగష్టు 30, 2009
keerthana
నామసంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనమ్.కలియుగంలొ విన్నా, చదివినా,ఆలపించినా భవరొగాలను తొలగించగల శక్తి మంత్రము అన్నమయ్య సంకీర్తన.రాగాలతొ రోగచికిశ్చ అనే పద్దతిని మనపూర్వికులు ఎపుడో ప్రయోగముచేసారు.
ఆనందభైరవి,శ్రీరాగం.కానడ,మద్ద్యమావతి,మోహన,హిందోళము కాపి.జోన్పురివంటి రాగాలు ఔషధివలె పనిచేసి మనసును వుత్తేజపరుస్తాయి అనడానికి ఏమాత్రము సందేహము లేదు.అన్నమయ్యసంకీర్తనలు భక్తిభావప్రకంపిత బీజాక్షరాలు.అవి ఔషథసిధ్ధి కలిగిన రాగాలతొ పాడితే అవిమనపాలిసంజీవని అవుతుంది.
ఈ నా విశ్వాసమె నాచే ఈ సి.డి రూపకల్పనకుఆధారము.అన్నమయ్యపదపున్నమి అనే ఈ సి.డిమరియు చిన్ని పుస్తక పరిచయము పెద్దల ఆశీర్వచనములతో విజయవంతముగాజరిగినది.
మ్రుదువుగా, లయభద్దముగా సాగే ఏ సంగీతమైనా రక్తప్రసరణను క్రమభద్దీకరిస్తుంది.సుఖనిద్రనుకలిగిస్తుంది. ఎన్నోరోగాలను నివారిస్తుంది.ఆనందంగావున్నమనసుకి మంచి ఆలోచనలుకలిగిమనలను వున్నతశిఖరాలకు చేర్చుతుంది.కలియుగములో అందరూ ఈ సంకీర్తనాసంజీవని సేవించి సిరివరుని చింతనలోతరించాలని నాఆకాంక్ష.
దాచుకో నీపాదాలకు తగనేచేసిన పూజలివి
లక్ష్మీ పున్నమ్మ
Add comment ఆగష్టు 20, 2009
అన్నమయ్య పద వేదం- భజగోవిందం
మరి ఎందుగతిలేదు,మనుప నీవే దిక్కు[
జెరసి లక్శ్మీశ నీశరణమె దిక్కు”
భవసాగరంబులో పడిమునిగిన నాకు
తివిరి నీనామమనె తేపయెదిక్కు
చివికి కర్మంబనెడు చిచ్చు జొచ్చిన నాకు
జవళి ఆచార్యకృపాజలధి యె దిక్కు”
ధన మోహ పాశముల గాలికిపొయ్యెడినాకు
కొనలనీపాదచింతకోమ్మయేదిక్కు
తనలి మనసనెడి ఆకసమున నున్ననాకు
కనుగొనగ నీదాస్యగరుడడే దిక్కు”
మరిగి సంసారమనెడి మంతిలి గిందడి నాకు
ధరభక్తియను బిలద్వారమే దిక్కు
ఇరవైన శ్రి వేంకటేశ ఇన్నిటా నాకు
అరుదైన నీఅంతరాత్మమె దిక్కు
ఇహ సంసారె బహుదుస్తారె
కృపయా పారె పాహి మురారె”
శంకరాచార్య వ్రాసిన భజగోవిందములోని ఈపదాలకి, అన్నమచార్యకీర్తనలోని భావానికి చాలా పోలిక కనిపిస్తుంది.కారణజన్ములయిన మహాత్ములందరి భోధలు అన్నీ ఒకేరకంగా వుంటాయి అనడానికీ ఇది ఒక నిదర్శనం.
కష్టభరితమైన ఈ సంసారాన్ని దయతో గట్టేక్కించమని శంకరాచార్య ఈస్లోకంలో చేబితే
మరి ఎందు గతి లేదు మనుపనీవె దిక్కు” అన్నారు అన్నమాచార్య.
ఇంగ్లిషులో వ్యాఖ్యానముతో ,యమ్.యస్.గారి ఖంఠములో భావయుక్తంగా పలికిన భజగోవిన్దం వినవలసిన జీవనసత్యం.
Add comment అక్టోబర్ 17, 2008
వనమాలి గదీశాంగీ శంఖీచక్రీచనందకి
విష్ణు సహస్రనామంలోని ఫలశృతి అర్థం తెలుసుకుంటే విష్ణు సహస్రనామ విశిస్టత తెలుస్తుందిఎవరు ఏది కోరితే అదిలభిస్తుందట.పూర్తిగా చదవలేకపోయినా ,ఒక్కశ్లోకంచదవగలిగినా చాలు మనసుకి వూరట కలగటానికి.వనమాలీగదీశాంగీ ………వాసుదేవోభిరక్సతు అనే శ్లోకం మనలను అన్ని ఆపదలనుండి రక్షిస్తుందని చెబుతారు.స్వామికి జరిగే నిత్యాభిషేకం నయనానందకరమైన ఒక మంగళకరమైన సేవ.చూసినప్పుడు కలిగే అనుభూతిని కీర్తనలో చిత్రీకరించారు అన్నమయ్య.
దేవ దుందుభులతోడ తేటతెల్లమైనాడు
సేవింపరో ఇదెవీడే సింగారదేవుడూ ..అని.
బంగారు మేడలలోన పన్నీటమజ్జనమాడి
అంగము తడిఒత్తగా అదెదేవుడు.
ముంగిట పులుకడిగినముత్తెమువలెనున్నాడు
కుంగనిరాజసముతో కొండవంటి దేవుడు”
తట్టుపునుగునించుక దండి సొమ్ములెల్లాబెట్టి
అట్టె అలమేల్మంగ అరుతాగట్టి
నెట్టన నమ్మినవారి నిధానమై వున్నవాడు
పట్టపుశ్రీవేంకటాద్రి పతియైనదేవుడు”
స్వామిసేవ మంగళ వాయిద్యాలతో,బంగారుమేడలో జరిగే వైభవం
అభీషేకముతరువాత స్వామి ముత్తెమువలెమెరుస్తూ రాజసము వుట్టిపడుతూవుంటాడట.
సుఘంధాలనద్దుకున్న స్వామి, అలమేలుమంగతోకూడి నమ్మినవారిపాలిసంపద వలే వున్నాడట.
ఎంతటి సుందరమైన భావన అది.మనసుకి, శరీరానికి దివ్యానుభూతిని కలిగించే మహిమాన్వితమైన సంకీర్తన.భక్తి భావన ఘాడమైతే విగ్రహమే సర్వ చైతన్యరూపమౌతుంది.మనకొక భంధమౌతుంది.మనమనసుని నిర్మలంగావుంచుతుంది.
Add comment అక్టోబర్ 15, 2008
ఓకపరికొకపరి ఒయ్యారమై
జగదానందకారకడు స్వామివారి ఆనందరూపాన్ని బ్రహ్మొత్సవాలలోచూసిన ప్పుడు అనిపించింది అన్నమాచర్యులవారు మధురమైనకీర్తనలనెలా వ్రాయగలిగారో.ప్రపంచంలోఎక్కడా ఇంతసుందరమైన దైవము లేడు.అన్నమయ్యది భక్తి భావాలతో కూడిన హృదయం.అందగానే స్పందించడంలో అతిశయమే లేదు.
నిరంతరము స్వామిసేవలో వున్న అన్నమయ్యకు స్వామిలో వివిధమైనఅందాలు కనిపించేవట.
ఒకపరికొకపరిఒయ్యారమై
మొగమునకళలెల్ల మొలచీనట్టుండె”
జగదేకపతిమేన జల్లినకర్పూరధూళి
జిగిగోని నలువంక జిందగాను
మొగిచంద్రముఖి వురమున నిలిపెగాన
పొగరు వెన్నెల ,దిగబోసినట్టుండె”
మెరయ శ్రీవేంకటేశు మేనసింగారముగాను
తరచయిన సొమ్ములు ధరియింపగా
మెరుగూబోణి అలమేలుమంగయుతాను
మెరుపుమేఘముగూడి మేరసీనట్టుండె”
స్వామిలో ఓకసారికి,మరిఒకసారికి కొత్తకళలు కనిపిస్తున్నాయట.
ఒకసారి నిలువున కర్పూరముతో పొగరువెన్నెల దిగబోసినట్ట్లుగావున్నాడట.
మరిఒకసారి,నిండు ఆభరణాలుధరియించిన అమ్మవారితోవున్న నల్లనిస్వామి మెరిసే మేఘములావున్నాడట.
చూసే కళ్ళకి ఆనందం కలిగితే,వినే మనసుకి ఆహ్లాదం కలిగించే కీర్తన.
జగన్మోహనాకారాన్ని మన హృదయములో నిలిపే భావన.
భగవత ప్రేమ భక్తికి లక్షణము.ఆప్రేమని అక్షర రూపములో చూపిన పదకవితాపితామహుడు అన్నమాచర్యులవారు .
http://www.youtube.com/watch?v=WvfvzKzYm3gwatch?v=WvfvzKzYm3g

Add comment అక్టోబర్ 11, 2008
శ్రీ రామచంద్ర కృపాలు భజమన
సమాజంలో విభిన్న వ్యక్తుల మధ్య మంచిగానిలబడాలంటె ఎంతో సహనభావంకావాలి.విపరీతమైన మానసిక ఒత్తిళ్ళమధ్య బ్రతికేవారికి సమతుల్యమైనమనోభావన ఎలా వుంటుంది?
వ్యామోహాలని నసియింపచేయునది,రాక్షసులకు కూడా ఆర్తిని కలిగించునది
ముల్లోకాలకి సంజీవనిఅయినది,భక్తులకు హితమైనది,భవభయాలను తొలగించునది అందరికి శ్రేయస్కరమైనది ఒక్కహరినామమే.
ముద్దుగా పెంచినచిలుకైనా చేయి వదిలితే ఎక్కడెక్కడొ తిరిగివస్తుంది.పంజరములోపేట్టి నేర్పితే “రామా “
అనిపలుకుతుంది.భగవంతుని ధ్యానించనిచో మనసు చంచలమవును.భక్తి భావన,మనసుని నిర్మలంగా,సమతుల్యంగా వుంచడానికి వుపయోగపడే మహత్తర సాధనం.
సాధనచే మనసుని భగవంతుని పై నిలుపలేనివారు భగవంతునికి ఇష్టమైన పనులైనాచేయాలి.మనతోపాటూ మరిఒకరికి వుపయోగపడె ఏపని అయినా అది భగవత కైంకర్యమే.
ఏపనికయినా మనోధర్మమే కావాలి.దానికే ఈసాధనలు.సంకీర్తనను మించిన వుత్తమ సాధన మరిఒకటి లేదు.
1 comment అక్టోబర్ 9, 2008
ఆనందసిధ్ధి
watch?v=ivxkJbL2oPkclick
ఆనందాలు అనేకరకాలు.
మనుష్యానందము.— మనంకోరినది సాధించినపుడు కలిగే ఆనందం.ఇది తాత్కాలికం.మళ్ళీకొత్తకోరిక మొదలవుతుంది.
ఋష్యానందం– ఒక మహాత్ముని దర్శించినపుడు కలిగే ఆనందం.ఇదీతాత్కాలికమే.
గంధర్వానందం—మంచిగానాన్ని,మంచినాదాన్ని విన్నపుడు కలిగే ఆనందం.ఇదీ తాత్కాలికమే.
దేవానందం—- దేవుళ్ళను,దేవాలయాలను దర్శించినపుడు కలిగేఆనందం.ఈ కలియుగములో ఇదీ కొంతకాలమే.
ప్రజాపత్యానందం— దేనినైనా సృస్టించినపుడు కలిగే ఆనందం.దక్షుడూ,మనువు లాటి వారు సాధించినవి.వారిఆనందం తపస్సువలన కలిగినది.అదీపరిపూర్ణమైనదికాదు.
మరిఏది పరిపూర్ణ అనందమూఅంటె, స్వాత్మానందము.
నిరంతర ధ్యానసమాధిలో భక్తుడు,భగవంతునికలిసిన నిశ్చలస్థితిలో కలిగే ఆనందమట.ఇది సర్వానందాల పరాకాష్ట.అలాటి ఆనందాన్ని అనుభవించిన అన్నమాచార్య కీర్తనాయోగము మనపాలి ఘన నిధానము.
అందుకే అన్నమాచార్య అంటారు
కామధేనువు,కల్పవృక్షమూ తనకు హరినామమే అని.
ఏపున శ్రీవేంకటేశుడె సర్వము
దాపై ఈతని వందనమే విధి
కాపుగ శరణాగతులే చుట్టాలు
పైపై గేలిచిన ప్రపన్నులకును అని”
ఓ సంకీర్తన వలన కలిగే సౌభాగ్యమది.భగవద్భక్తులనేకులు మన బంధువులవుతారు.మనకిక ఒంటరితనానికి తావేలేదు.ఆనందానికి అవధులులేవు.
Add comment అక్టోబర్ 7, 2008
విజయ ముహుర్తము
“విజయ విమల వంద్య వందారు జనవత్శల
వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాశిని”
లలితాసహస్రములోని శ్లోకము
పద్ముడనేరాక్షసుని సంహరించి,”విజయఅపరాజిత” అని దేవతలచేస్తుతింపబడినది.కాలవిభజనచేసే కాలస్వరూపిణి విజయ.
విజయముహుర్త రహస్యము ఒకటున్నది.
సాధారణంగా ఎక్కడపోటీజరిగినా కొందరు గేలుస్తారు,కొందరు ఓడిపోతూవుంటారు.
పోటీజరిగేసమయములో అందరూఇదిగోవీరు గేలుస్తారు అని అనుకోనే అంతలో మరేవరో విజయాన్ని చేజిక్కించుకుంటారు.అదేమి విచిత్రమో,ఇదెలా జరిగింది అనుకొనేలోపల జరిగిపోతుంది.”క్షణకాలం”అనే ముహుర్తమే విజయముహుర్తం.రెప్పపాటులో గేలవనూవచ్చు,ఓడనూవచ్చు.
అదే విజయముహుర్త రహస్యము.ఆక్షణకాలము అమ్మవారి గుప్పిట వుంటుది.ఆక్షణాన్ని చేజిక్కించుకోవాలంటె అమ్మవారికరుణాకటాక్షాలుండాలి.ఆకరుణను దక్కించుకోడానికికూడా భక్తుడు తన అంతరంగాన్ని నిర్మలంగావుంచుకోవాలి.
“కమలే కమలాక్ష వల్లభే
త్వంకరుణాపూర తరంగితై రపాంగై
అవలోకయమాం, అకించనానాం
ప్రథమంపాత్ర మకృత్రిమం దయాయాహ”
కనకధారా స్తోత్రములోని శ్లోకము.
అమ్మా నీకరుణాతరంగిత దృక్కులు నాపై ఓక్కసారి ప్రసరించు తల్లీ అని ఆర్తితో అడగాలి.
అమ్మాఅనిఅడిగితే జగన్మాత కాదని అనగలదా.అరవైనాలుగు కోట్ల యోగిని గణాలు అమ్మవారి చుట్టు పరిచర్యలు చేస్తూవుంటారట.వేయి పూజలు,వేయిస్తొత్రాలు,వేయినామజపాలు అన్నటి ధ్యేయమూఒకటే.
నిశ్చలధ్యానస్థితిసాధించడం.నిరంతరం సాధనచేయగాకుదురేదిధ్యానస్థితి.స్మరణం,శ్రవణం,కీర్తనం,స్తోత్రం,ఏదయినా నియమంగాచేయగలిగితే ఎవరైనా విజయముహుర్తాన్నిదక్కించుకోవచ్చు.
“పాల జలనిధిలోని పసనైనమీగడ
మేలిమితామర లోని మించువాసనా
నీలవర్ణు వురముపై నిండినా నిధానమవై
ఏలేవులోకములు,మమ్మేలవమ్మా అని కీర్తించారు అన్నమాచార్యులవారు
“క్షీరాబ్ధికన్యకకు,శ్రీమహాలక్ష్మికి నిలువుమాణిక్యముల నీరాజనం ,” అన్నారు.
ఇంతచక్కగ కీర్తిస్తే శ్రీ మహాలక్ష్మి చిరునవ్వులు కురిపించదా,సిరులజల్లుకురిపించ కుండా వుండ గలదా.
Add comment అక్టోబర్ 6, 2008
భక్తి భంధము
పుట్తిన ప్రతిజీవికి బంధాలు అనేకం.అవిలేనిజీవితంలేదు..అవే జీవితమనుకొంటె మటుకుఅవి మనపాలి బాధలవుతాయి.శరీరములోశక్తి వున్నపుడు,లేనప్పుడూకూడా సంసార బంధాలు మనకు సంకెళ్ళువేస్తాయి.ఏది శాశ్వతబంధమో తేలియకపోవడం మాయ.భగవంతునితోడి బంధము శాశ్వతమని,ఆనందదాయకమని తేలికపోవడం మన ఖర్మము అంటారు అన్నమాచార్యులవారు.
భగవంతుడు కేవలము ఒక విగ్రహంకాదు, మన దగ్గరగా వుండి వూరడించి అక్కునచేర్చుకొనే ఆత్మబంధువు అని తేలుసుకోగలిగితే ఏబాధ నయినాతట్టుకోవచ్చు.సంసారములో వుండి కూడా భగవంతునిపై అనురక్తి కలిగి శాశ్వత బంధమేదోతెలుసుకుని జీవించినవాడు అన్నమయ్య.
కలియుగములో మనిషికి మనిషికి దూరాలు పెరుగుతున్నాయి.మనసుకి ఆనందదాయిని సంకీర్తనమే.
Add comment అక్టోబర్ 4, 2008
