విష్ణు సహస్రనామంలోని ఫలశృతి అర్థం తెలుసుకుంటే విష్ణు సహస్రనామ విశిస్టత తెలుస్తుందిఎవరు ఏది కోరితే అదిలభిస్తుందట.పూర్తిగా చదవలేకపోయినా ,ఒక్కశ్లోకంచదవగలిగినా చాలు మనసుకి వూరట కలగటానికి.వనమాలీగదీశాంగీ ………వాసుదేవోభిరక్సతు అనే శ్లోకం మనలను అన్ని ఆపదలనుండి రక్షిస్తుందని చెబుతారు.స్వామికి జరిగే నిత్యాభిషేకం నయనానందకరమైన ఒక మంగళకరమైన సేవ.చూసినప్పుడు కలిగే అనుభూతిని కీర్తనలో చిత్రీకరించారు అన్నమయ్య.
దేవ దుందుభులతోడ తేటతెల్లమైనాడు
సేవింపరో ఇదెవీడే సింగారదేవుడూ ..అని.
బంగారు మేడలలోన పన్నీటమజ్జనమాడి
అంగము తడిఒత్తగా అదెదేవుడు.
ముంగిట పులుకడిగినముత్తెమువలెనున్నాడు
కుంగనిరాజసముతో కొండవంటి దేవుడు”
తట్టుపునుగునించుక దండి సొమ్ములెల్లాబెట్టి
అట్టె అలమేల్మంగ అరుతాగట్టి
నెట్టన నమ్మినవారి నిధానమై వున్నవాడు
పట్టపుశ్రీవేంకటాద్రి పతియైనదేవుడు”
స్వామిసేవ మంగళ వాయిద్యాలతో,బంగారుమేడలో జరిగే వైభవం
అభీషేకముతరువాత స్వామి ముత్తెమువలెమెరుస్తూ రాజసము వుట్టిపడుతూవుంటాడట.
సుఘంధాలనద్దుకున్న స్వామి, అలమేలుమంగతోకూడి నమ్మినవారిపాలిసంపద వలే వున్నాడట.
ఎంతటి సుందరమైన భావన అది.మనసుకి, శరీరానికి దివ్యానుభూతిని కలిగించే మహిమాన్వితమైన సంకీర్తన.భక్తి భావన ఘాడమైతే విగ్రహమే సర్వ చైతన్యరూపమౌతుంది.మనకొక భంధమౌతుంది.మనమనసుని నిర్మలంగావుంచుతుంది.
