అన్నమయ్య జయంతి 
అప్పని వర ప్రసాది అన్నమయ్య
అప్పసము మాకె కలడన్నమయ్యా’
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలిచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వేంకటనాధుని ఇచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య
అందరికీ ఏలికైన ఆదినారాయణుతన
అంతరంగాన నిలిపెను అన్నమయ్య
సంతసాన చెలువొందెఆ సనక సనందాదులంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య
గతి, మతి లేని కలియుగములో
గమ్యమేది?
పరమార్థమేది?
అన్నమాచార్యులవారు కలియుగస్వభావాన్ని ముందేవూహించారేమో మనకి ఒక సులభమైన
మార్గాన్ని చూపించారు.
అదియే సంకీర్తనా మార్గము.
గతులన్ని ఖీలమైన కలియుగమందు
గతి ఈతడె చూపె ఘనగురుదైవము.
నియమములు ఈతడెగా నిలిపె ప్రపన్నులకు
దయతో మోక్షము చూపెతగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కే వాకిటను
దయచూచిమమ్మునిట్టె తల్లితండ్రిదైవము.
”
అపురూపమైన,సంగీత సాహిత్య సంపదని ఇచ్చిన
ఆమహనీయునికి నివాళి ఆసంపదను మనసారా
అనుభవించి మరో తరానికి భద్రంగా అందించడం.
తెలుగు సాహిత్యాన్ని చదవండి.
సంగీతాన్ని ఆస్వాదించండి
అన్నమయ్య ఆరాధనలో
లక్ష్మీ పున్నమ్మ
