Category: Uncategorized


http://www.youtube.com/watch?v=1bBC780BW60  

http://lpunnamma.files.wordpress.com/2011/05/copy-of-dsc00895.jpg

హరికీర్తనలో జీవ్తాన్ని గడిపి తరించిన ప్రపన్నుడు అన్నమాచార్యులవారు.
కలియుగ జీవన మార్గంలొ సంకీర్తన సాధనమైతే ..అంతకుమించిన యోగమేమున్నది.అపుడు కైవల్యమార్గాలు కనిపిస్తాయి.మనజీవితమెంత అపురూపమో తెలిసి ,కలిగిన ఆనందం మనకి వున్నత ఆలోచనలు కలిగి మనలను వున్నతశిఖరాలకు చేర్చుతుంది .

పరిశుధ్ధుడైన  ఆత్మశోధకునికి కైవల్యాన్ని అనుగ్రహించె పరమాత్ముడాయన.

తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో పాడే అవకాశం నాకు కలిగినయోగమే .సంకీర్తనా మార్గమే నాజీవన భాగ్యము .
 
నా క్రియ ఇది నీదివ్య కీర్తనమే .

అన్నమయ్య ఆరాధనలో

లక్ష్మీ పున్నమ్మ.

View full article »

ఆత్మ నివేదన

సర్వ సాక్షివి నీవుసర్వాంతరంగుడవు

సర్వంసహాచక్రవర్తి నిర్వాణమూర్తి

నిగమాంత కీర్తి సర్వాపరాధములు క్షమియింపవే”

మనసులోని భాధలు భయాలు భగవంతుని పాదాలకు సమర్పించితే

కలిగే మనోబలం మనచుట్టూ వందలాది మనుషులున్నాకలుగుతుందా

భగవంతునిపై వున్న విశ్వాసం కలిగించే శక్తి మరే ఆయుధానికైనావున్నదా
మనిషికి స్థిత ప్రగ్న్యత కలిగించె ఒకే ఒక ప్రక్రియ నిర్మలముగా సాగే మానసిక నివేదన.అదేప్రార్ధన.
హరి అంటేనెసర్వపాపాలను హరించేవాఆఆడు.ఆమహనీయుడు స్థవనీయుడు ఆరాధనీయుడు.శాంతిని ప్రసాదించె కాంతికిరణాలకు నిలయం హరినామం.
ఆమహనీయునిదర్శించడానికి నిర్మల హ్రుదయముతో ఆత్మనివేదన చేసుకోవడమే వుత్తమమార్గము
అన్నమాచార్యులవారి సాధనామార్గమే మనకూ ఆచరణీయము.
జనన మరణాలను తెలుసుకోలెను నాలోని మంచి చెడులను తెలుసుకోలేను నిన్ను తెలుసుకోవడం నాకుసాధ్యమా.నిన్నువిడువలేను జగద్రక్షకుడవు నన్నునాజీవితంకడవరకు రక్షించు స్వామి అనే ఆత్మనివేదన ఈకీర్తన
దీనుడనేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక

మతి జననమెరుగ మరణంబెరుగను
ఇతవుగనినునిక ఎరిగేనా
క్షితి పుట్టింఛింన శ్రీపతివి నీవు
తతినాపైదయ తలతువు గాక
తడవనాహేయము తడవ నా మలినము
తడయక నీమేలు తలచేనా
విడువలేని శ్రీ వేంకట విభుడవు
కడదాకా నను కాతువుగాక

ఒకసారి ఆపాదాలను ఆశ్రయించించిన భక్తుడు ఆపాదాలు విడిచి మనగలడా.
నాకన్నీ నీవే అన్నఏ భక్తుని ఆయనకాదన్నాడు.శరణాగతిని మించిన భక్తి మార్గము మరిఒకటిలేదు.
అన్నమయ్య జీవితమే ఒకధీర్ఘ శరణాగతి

విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం

అహ మిహ తవ పద దాస్యం అనిశం భజామి.
అన్నమయ్య జయంతి సుభాశీశులతో

అన్నమయ్య ఆరాధనలో
లక్ష్మి పున్నమ్మ
.

sankeerthanasanjeevani

http://www.youtube.com/watch?v=BF1mbCnCYtw


     ఈ కీర్తన ఇటీవల విడుదల చేసిన నాఆల్బమ్ సంకీర్తనా  సంజీవని లోనిది.

http://www.youtube.com/watch?v=vUQFIFzrY4c

keerthana

malayappa నామసంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనమ్.కలియుగంలొ విన్నా, చదివినా,ఆలపించినా భవరొగాలను తొలగించగల  శక్తి మంత్రము అన్నమయ్య సంకీర్తన.రాగాలతొ రోగచికిశ్చ అనే పద్దతిని మనపూర్వికులు ఎపుడో ప్రయోగముచేసారు.

ఆనందభైరవి,శ్రీరాగం.కానడ,మద్ద్యమావతి,మోహన,హిందోళము కాపి.జోన్పురివంటి రాగాలు ఔషధివలె పనిచేసి మనసును వుత్తేజపరుస్తాయి అనడానికి ఏమాత్రము సందేహము లేదు.అన్నమయ్యసంకీర్తనలు భక్తిభావప్రకంపిత బీజాక్షరాలు.అవి ఔషథసిధ్ధి కలిగిన రాగాలతొ పాడితే అవిమనపాలిసంజీవని అవుతుంది.
ఈ నా విశ్వాసమె నాచే ఈ సి.డి రూపకల్పనకుఆధారము.అన్నమయ్యపదపున్నమి అనే  ఈ సి.డిమరియు చిన్ని పుస్తక పరిచయము పెద్దల ఆశీర్వచనములతో విజయవంతముగాజరిగినది.
మ్రుదువుగా, లయభద్దముగా సాగే ఏ సంగీతమైనా రక్తప్రసరణను క్రమభద్దీకరిస్తుంది.సుఖనిద్రనుకలిగిస్తుంది. ఎన్నోరోగాలను నివారిస్తుంది.ఆనందంగావున్నమనసుకి మంచి ఆలోచనలుకలిగిమనలను వున్నతశిఖరాలకు చేర్చుతుంది.కలియుగములో అందరూ ఈ సంకీర్తనాసంజీవని సేవించి సిరివరుని చింతనలోతరించాలని నాఆకాంక్ష.

దాచుకో నీపాదాలకు తగనేచేసిన పూజలివి
లక్ష్మీ పున్నమ్మ

మరి ఎందుగతిలేదు,మనుప నీవే దిక్కు[
జెరసి లక్శ్మీశ నీశరణమె దిక్కు"

భవసాగరంబులో పడిమునిగిన నాకు
తివిరి నీనామమనె తేపయెదిక్కు
చివికి కర్మంబనెడు చిచ్చు జొచ్చిన నాకు
జవళి ఆచార్యకృపాజలధి యె దిక్కు"

ధన మోహ పాశముల గాలికిపొయ్యెడినాకు
కొనలనీపాదచింతకోమ్మయేదిక్కు
తనలి మనసనెడి ఆకసమున నున్ననాకు
కనుగొనగ నీదాస్యగరుడడే దిక్కు"

మరిగి సంసారమనెడి మంతిలి గిందడి నాకు
ధరభక్తియను బిలద్వారమే దిక్కు
ఇరవైన శ్రి వేంకటేశ ఇన్నిటా నాకు
అరుదైన నీఅంతరాత్మమె దిక్కు

ఇహ సంసారె బహుదుస్తారె
కృపయా పారె పాహి మురారె"

శంకరాచార్య వ్రాసిన భజగోవిందములోని  ఈపదాలకి, అన్నమచార్యకీర్తనలోని భావానికి  చాలా పోలిక కనిపిస్తుంది.కారణజన్ములయిన మహాత్ములందరి భోధలు అన్నీ ఒకేరకంగా వుంటాయి అనడానికీ ఇది ఒక నిదర్శనం.

కష్టభరితమైన ఈ సంసారాన్ని దయతో గట్టేక్కించమని శంకరాచార్య ఈస్లోకంలో చేబితే
మరి ఎందు గతి లేదు మనుపనీవె దిక్కు" అన్నారు అన్నమాచార్య.

ఇంగ్లిషులో వ్యాఖ్యానముతో ,యమ్.యస్.గారి ఖంఠములో భావయుక్తంగా పలికిన భజగోవిన్దం వినవలసిన  జీవనసత్యం.

 

 

విష్ణు సహస్రనామంలోని ఫలశృతి అర్థం తెలుసుకుంటే విష్ణు సహస్రనామ విశిస్టత తెలుస్తుందిఎవరు ఏది కోరితే అదిలభిస్తుందట.పూర్తిగా చదవలేకపోయినా ,ఒక్కశ్లోకంచదవగలిగినా చాలు మనసుకి వూరట కలగటానికి.వనమాలీగదీశాంగీ ………వాసుదేవోభిరక్సతు  అనే శ్లోకం  మనలను అన్ని ఆపదలనుండి రక్షిస్తుందని చెబుతారు.స్వామికి జరిగే నిత్యాభిషేకం నయనానందకరమైన ఒక మంగళకరమైన సేవ.చూసినప్పుడు కలిగే అనుభూతిని కీర్తనలో చిత్రీకరించారు అన్నమయ్య.

దేవ దుందుభులతోడ తేటతెల్లమైనాడు
సేవింపరో ఇదెవీడే సింగారదేవుడూ  ..అని.
బంగారు మేడలలోన పన్నీటమజ్జనమాడి
అంగము తడిఒత్తగా అదెదేవుడు.
ముంగిట పులుకడిగినముత్తెమువలెనున్నాడు
కుంగనిరాజసముతో కొండవంటి దేవుడు”

తట్టుపునుగునించుక దండి సొమ్ములెల్లాబెట్టి
అట్టె అలమేల్మంగ  అరుతాగట్టి
నెట్టన నమ్మినవారి నిధానమై వున్నవాడు
పట్టపుశ్రీవేంకటాద్రి పతియైనదేవుడు”

స్వామిసేవ మంగళ వాయిద్యాలతో,బంగారుమేడలో జరిగే వైభవం
అభీషేకముతరువాత స్వామి ముత్తెమువలెమెరుస్తూ రాజసము వుట్టిపడుతూవుంటాడట.
సుఘంధాలనద్దుకున్న స్వామి, అలమేలుమంగతోకూడి నమ్మినవారిపాలిసంపద వలే వున్నాడట.
ఎంతటి సుందరమైన భావన అది.మనసుకి, శరీరానికి దివ్యానుభూతిని కలిగించే మహిమాన్వితమైన సంకీర్తన.భక్తి భావన ఘాడమైతే విగ్రహమే సర్వ చైతన్యరూపమౌతుంది.మనకొక భంధమౌతుంది.మనమనసుని నిర్మలంగావుంచుతుంది.

జగదానందకారకడు స్వామివారి ఆనందరూపాన్ని బ్రహ్మొత్సవాలలోచూసిన ప్పుడు అనిపించింది అన్నమాచర్యులవారు మధురమైనకీర్తనలనెలా వ్రాయగలిగారో.ప్రపంచంలోఎక్కడా ఇంతసుందరమైన దైవము లేడు.అన్నమయ్యది భక్తి భావాలతో కూడిన హృదయం.అందగానే స్పందించడంలో అతిశయమే లేదు.
నిరంతరము స్వామిసేవలో  వున్న అన్నమయ్యకు స్వామిలో వివిధమైనఅందాలు కనిపించేవట.
ఒకపరికొకపరిఒయ్యారమై
మొగమునకళలెల్ల మొలచీనట్టుండె”
జగదేకపతిమేన జల్లినకర్పూరధూళి
జిగిగోని నలువంక జిందగాను
మొగిచంద్రముఖి వురమున నిలిపెగాన
పొగరు వెన్నెల ,దిగబోసినట్టుండె”

మెరయ శ్రీవేంకటేశు మేనసింగారముగాను
తరచయిన సొమ్ములు ధరియింపగా
మెరుగూబోణి అలమేలుమంగయుతాను
మెరుపుమేఘముగూడి మేరసీనట్టుండె”

స్వామిలో ఓకసారికి,మరిఒకసారికి కొత్తకళలు కనిపిస్తున్నాయట.

ఒకసారి నిలువున కర్పూరముతో పొగరువెన్నెల  దిగబోసినట్ట్లుగావున్నాడట.
మరిఒకసారి,నిండు ఆభరణాలుధరియించిన అమ్మవారితోవున్న నల్లనిస్వామి మెరిసే మేఘములావున్నాడట.

చూసే కళ్ళకి ఆనందం కలిగితే,వినే మనసుకి ఆహ్లాదం కలిగించే కీర్తన.
జగన్మోహనాకారాన్ని మన హృదయములో నిలిపే భావన.
భగవత ప్రేమ భక్తికి లక్షణము.ఆప్రేమని అక్షర రూపములో చూపిన పదకవితాపితామహుడు అన్నమాచర్యులవారు .         

http://www.youtube.com/watch?v=WvfvzKzYm3gwatch?v=WvfvzKzYm3g

Follow

Get every new post delivered to your Inbox.