నీకే శరణు నీవునన్ను కరునించు
ఈకడ నాకడదిక్కు ఎవరున్నారికను
కన్నులచంద్ర సూర్యులు గలవేలుపవు నీవు
పన్నినలక్శ్మీభూమి పతివినీవు
అన్నిట బ్రహ్మకు తండ్రి అయిన ఆదివేలుపవు
ఎన్నగనీ కంటె నేక్కుడెవరున్నారికను”‘
అరసి జీవులకేల్ల అంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చేశ్రీవేంకటెశ
పురుసోత్తముడవు భువన రక్షకుడవు
ఇరవైననీవే గాక ఎవరున్నారికను”‘
భగవంతునిపైన పరిపూర్ణ విశ్వాసం అది.
అన్యధా శరణంనాస్తి, త్వమేవ శరణమ మమ అన్నఎంతమందిని ఆయన కరుణించలేదు?
మన కున్న భాధలకి,మనోవ్యాధులకి మంచిమందు శరణాగతి.
మనసులోని భాధలు,భయాలు భగవంతుని కి సమర్పించగలిగితే కలిగే మనోబలం మనచుట్టూవందలాది మనుసులున్నా,ఎన్నివేలసంపదలున్నలభిస్తుందా.ప్రార్థనకున్న బలంఅది.
భగవంతునిపై వున్న విశ్వాసమ కలిగించే శక్తి మరే ఆయుధానికైనా వుందా?
మనిషి కి ,మనసుకి శక్తిని ఇచ్చే వజ్రాయుధమే నిర్మలంగాసాగే మానసిక నివేదన ప్రార్ధన.
