watch?v=oCg158CHMokఅన్నమాచార్య  ౬౦౦ శతజయంతి వుత్శవాల సందర్భంగా మేము చేసిన కార్యక్రమాలలో మనసుకి త్రుప్తిని కలిగించిన కర్యక్రమం చెర్లపల్ల సెంట్రలు జైలులో నూతనసంవత్శర సంబరం ఖైదీల కోసం అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమాన్నిజరుపుకోవడం.కార్యక్రమాన్ని సాధించిన సారధి అక్షర అధినేత శ్రీ క్రిష్ణారెడ్డి అయితే,విజయవంతంచేసిన వారువ్యాఖ్యతో చి.శంకర రావు,గాత్రంతో చి.క్రిష్ణారావు,వాయిద్యాలతో శ్రీరమణమూర్తిగారు.శ్రీబ్రహ్మానందం గారు.

మాకు అనుమతి ఒకగంట మాత్రమే.మూడు గంటల కార్యక్రమంజరిగినది.జైలరుశ్రీరమణరావుగారు మాతో పాటు వున్నారు.స్వామి మా అందరిని ఈ విధము గా వుపయోగించినందుకు మాకు కలిగిన అనుభూతి మరిచిపోలేనిది.
భగవంతునితో  భంధాన్ని ఏర్పరచుకొన్నమనిషికి ఒంటరితనంవుండదని,మనసులో వూయలకట్టి బిడ్డగా లాలించగలిగితే,మనసుకి వూరట కలుగుతుందని చెప్పి ” జో అచ్యుతానంద ” కీర్తనతో కార్యక్రమాన్ని ముగించేసరికి,చాలమంది కళ్ళలో నీళ్ళు తుడుచుకుంతున్నారు.
అన్నీవున్నపుడు మనిషికి వాటి విలువతేలియదు,వాటిని పోగోట్టుకున్నపుడుగాని వాటివిలువతెలిసిరాదు.
” నిదురచే కోన్నాళ్ళు,నేరములకొన్నాళ్ళు
ముదిమిచే కోన్నాళ్ళు మోసపోయి
కదిసికోరినను గతకాలంబు వచ్చునే
మదిమదినే వుండి ఏమరకబ్రతుకుటగాక;అని అన్న అన్నమయ్య సందేశం అక్షర సత్యం.