భక్తి,భావం కలిపితే అది అన్నమయ్య అంతరంగమ్
మనోమాలిన్యాన్ని తోలగించి,వుపశమనాన్ని ఇచ్చేది సంగీతం.
భక్తికి సంగీతం కలిసితే ఏర్పడేది దివ్య సంకీర్తనా ఔషధం.
మానవజీవితాల పాలిటి సంజీవని సంకీర్తన.

చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
రోగాలడచి రక్శిం చే దివ్యౌషధమా”ఆన్నారు అన్నమాచార్యులవారు.పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా అనే కీర్తనలో
నేటి యాంత్రికజీవితాలలో అలసిన మనసుకి వూరట కలిగించ గల శక్తి  ఒక్క భక్తి సంగీతానికే వున్నది
ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించడానికి  ” అన్నారు అన్నమాచార్యులవారు.తాను అనుభవించిన ఆ శక్తిని మనమంతా అనుభవించాలని తన కీర్తనలద్వారా సందేశాన్నిఇచ్చిన మహానుభావుడు అన్నమయ్య.
 ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే,దిక్కుమరిలేదు”
కొరమాలి వున్నవేళ కులము చేడినవేళ
చెరబడి ఒరులచేజిక్కినవేళ
ఒరపైన హరినామం ఒక్కటెగతిగాక,మరచితప్పిననైన మరిలేదు తెరగు”

సంకెలబేట్టినవేళ చంపబిలిచినవేళ
అంకిలిగా అప్పులవారాగినవేళ
వెంకటేశు నామమే విడిపించ గతిగాక మంకుభుద్ది పోరలిన మరిలేదు తెరగు”
ఈఒక్క కీర్తన చాలు మనలను అన్నివేళల కాపాడడానికి