ఆర్తా విషణ్ణ,శిధిలాశ్చ భీతః
ఘోరేషుచ వ్యాధిః వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం
విముక్త ధుఖాః సుఖినోభవంతి
విష్ణు సహస్రనామము లోని శ్లోకమ్.
భయంలోను,భాధలోను,అనారోగ్యస్థితిలోవున్నపుడూ,ఒక్క నారాయణ శబ్దాన్ని స్మరించడము చేత భాధలన్నీతొలగి,సుఖంకలుగుతుంది,అన్నది భావము.
ఆ భావనని స్ఫురించ చేసే అన్నమాచార్యకీర్తన
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా ఇతవైన చవులెల్ల నొసగ;;
ఇది ఒకటి హరినామ మింతైన చాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటి హరినామమంత్రమది చాలదా
పదివేలు నరకకూపముల వెడలించ”
తగు వేంకటేశుకీర్తనమొకటి చాలదా
జగములో కల్పభూజంబువలెనుండ
సోగిసి ఈవిభుని దాసుల కరుణ చాలదా
నగవు చూపులను వున్నతమెపుడు చూప”
ఒక్క హరినామ స్మరణము వలన పదివేలనరకకూపములనుండివిముక్తి కలుగుతుందట.ఒక్క వేంకటేశకీర్తనచాలట
కల్పవృక్షమువలే జీవించడానికి,హరిదాసుల సహచర్యములోవున్నావున్నతి కలుగుతుందని ఆచార్యులవారివువాచ.
భగవంతుని సేవకి కీర్తనలని పుష్పాలుగ సమర్పించిన పరమభక్తుడు అన్నమాచార్య.ఆయన వ్రాసిన ప్రతికీర్తనకి అంతటి శక్తి వున్నది.ఆకీర్తనలని పాడినా, విన్నా,చదివినా ఫలసిధ్ధి తప్పకకలుగుతుంది.ఇది నా విస్వాసమ్.
“సర్వే జనాసుఖినోభవంతి”

