సమాజంలో  విభిన్న వ్యక్తుల మధ్య మంచిగానిలబడాలంటె ఎంతో సహనభావంకావాలి.విపరీతమైన మానసిక ఒత్తిళ్ళమధ్య బ్రతికేవారికి సమతుల్యమైనమనోభావన ఎలా వుంటుంది?
వ్యామోహాలని నసియింపచేయునది,రాక్షసులకు కూడా ఆర్తిని కలిగించునది
ముల్లోకాలకి సంజీవనిఅయినది,భక్తులకు హితమైనది,భవభయాలను తొలగించునది అందరికి శ్రేయస్కరమైనది ఒక్కహరినామమే.
ముద్దుగా పెంచినచిలుకైనా చేయి వదిలితే ఎక్కడెక్కడొ తిరిగివస్తుంది.పంజరములోపేట్టి నేర్పితే “రామా “
అనిపలుకుతుంది.భగవంతుని ధ్యానించనిచో మనసు చంచలమవును.భక్తి భావన,మనసుని నిర్మలంగా,సమతుల్యంగా వుంచడానికి వుపయోగపడే మహత్తర సాధనం.
సాధనచే మనసుని భగవంతుని పై నిలుపలేనివారు భగవంతునికి ఇష్టమైన పనులైనాచేయాలి.మనతోపాటూ మరిఒకరికి వుపయోగపడె ఏపని అయినా అది భగవత కైంకర్యమే.
ఏపనికయినా మనోధర్మమే కావాలి.దానికే ఈసాధనలు.సంకీర్తనను మించిన వుత్తమ సాధన మరిఒకటి లేదు.