దేవీ నవరాత్రుల సమయములో స్వామివారికిజరిగే వుత్శవాలు.బ్రహ్మ అధ్వర్యములో జరిగే జగత్కల్యాణవుత్సవాలు.ముక్కోటిదేవతలు భూలోకనికి తరలివస్తారని ప్రతీతి.వివిధవాహనాలలో స్వామి తిరువీధులలో విహరిస్తారు.”తిరువీధుల విహరించే దేవదేవుడు” అనే కీర్తనలో స్వామివారివాహానాలను,వుత్సవ వైభవాన్ని వర్ణించారు అన్నమాచార్య.
స్వామివారికిజరిగే “వూంజల సేవ ,సహస్రదీపాలతో కనులవిందుగా కలియుగ వైఖుంఠమువలే కనిపిస్తుంది.
నీలమేఘశ్యాముని కరుణ కటాక్షవీక్షణాలుమనకు లభిస్తాయి.
కలియుగములో ఈస్వామి లేకపోతే మనకి ఎవరున్నారు అనిపిస్తుంది.
“వేంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి”
