అపర శంకరులు ఆదిశంకరాచార్యులు.అమ్మవారి కరుణచే, వ్రాసిన ప్రతిస్త్రోత్రములోని ప్రతి అక్షరము ఒకదేవతాశక్తిగాభాసిల్లి భక్తులకు అనంతసిరులను ప్రసాదించగల శక్తిస్వరూపాలయినిలచినాయి.
శక్తిపీఠాలలోనివుగ్రబీజాక్షరాలను తోలగించి సాత్వికబీజాక్షరాలను అమర్చి అందరూపూజించుకోనేందుకు అనువుగాశ్రీ చక్రరూపకల్పనచేసిన మహానుభావుడు.అమ్మవారి పూజలంటేభపడె ఎందరికో ఓకపూజా విధానాన్ని చూపారు ఆయనస్తోత్రాలద్వారా.
“మహిమాన్వితమైన స్తోత్రము కనకధారాస్తవము’”

దీనికి ఒకకథ కూడా వున్నది.
శంకరాచార్యులవారు భిక్షకై ఒక పేదరాలిఇంటికి వేళ్ళారట.పూటగడవని ఆపేదరాలు ఒకవుసిరికాయను భిక్షగావేసిందట.ఆమెపేదరికాన్నిచూసి కనకధారస్తోత్రముతో లక్ష్మీదేవినిస్తుతించగా బంగారువుసిరికాయలు కురిసాయట.
ఆస్తోత్రానికి అంతటి శక్తివున్నది.
మన దైనందినజీవితాలలో పారాయణకి వీలుకాదు.మనసుపేట్టి ఒక్కశ్లోకాన్ని చదివినా మానసికశాంతి,అనందాలులభిస్తాయి.
కమలవాసిని,కమలాక్షునిఇల్లాలుమనకు అనంతమైనసిరులను ప్రసాదిస్తుంది.