Tag Archive: Uncategorized


అన్నమయ్య క్రిష్ణ తత్వము భక్తి లోని వున్నతస్థానమైన మాతృభక్తి.భక్తుడు తానే తల్లి గా భగవంతుని ముద్దులాడగలగడము.లాలపోసాడు,వుగ్గుపట్టాడు,ముద్దులాడినాడు,నవరత్నాలతో పోలిచి తానేయశోదవలే మురిసినాడు.క్రిష్ణ శబ్దము ఆనందానికి ప్రతిరూపము.
చేత వెన్నముద్ద,చెంగల్వ పూదండ
బంగారు మోలత్రాడు పట్టుదట్టి
సందెట తాయెత్తులు,సరిమువ్వగజ్జెలు
చిన్నిక్రిష్ణ,నిన్ను చేరికొలుతు.

పసిబిడ్డలందరూ క్రిష్ణ రూపాలే.భగవత స్వరూపాలు.ముద్దులొలికే ఆరూపం ఆనందదాయకం.
దివ్యమైనగాత్రం భారతరత్న శ్రీమతి సుబ్బలక్ష్మిగారిది.వారు పాడిన ఒక అపురూపకీర్తన.
రారా చిన్నన్న”"
 watch?v=HGUyA-ZMAU8

సంజీవన మంత్రము

ఆర్తా విషణ్ణ,శిధిలాశ్చ భీతః
ఘోరేషుచ వ్యాధిః వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం
విముక్త ధుఖాః సుఖినోభవంతి
విష్ణు సహస్రనామము లోని శ్లోకమ్.

భయంలోను,భాధలోను,అనారోగ్యస్థితిలోవున్నపుడూ,ఒక్క నారాయణ శబ్దాన్ని స్మరించడము చేత భాధలన్నీతొలగి,సుఖంకలుగుతుంది,అన్నది భావము.

ఆ భావనని స్ఫురించ చేసే అన్నమాచార్యకీర్తన
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా ఇతవైన చవులెల్ల నొసగ;;

ఇది ఒకటి హరినామ మింతైన చాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటి హరినామమంత్రమది చాలదా
పదివేలు నరకకూపముల వెడలించ”
తగు వేంకటేశుకీర్తనమొకటి చాలదా
జగములో కల్పభూజంబువలెనుండ
సోగిసి ఈవిభుని దాసుల కరుణ చాలదా
నగవు చూపులను వున్నతమెపుడు చూప”

ఒక్క హరినామ స్మరణము వలన పదివేలనరకకూపములనుండివిముక్తి కలుగుతుందట.ఒక్క వేంకటేశకీర్తనచాలట
కల్పవృక్షమువలే జీవించడానికి,హరిదాసుల సహచర్యములోవున్నావున్నతి కలుగుతుందని ఆచార్యులవారివువాచ.
భగవంతుని సేవకి కీర్తనలని పుష్పాలుగ సమర్పించిన పరమభక్తుడు అన్నమాచార్య.ఆయన వ్రాసిన ప్రతికీర్తనకి అంతటి శక్తి వున్నది.ఆకీర్తనలని పాడినా, విన్నా,చదివినా ఫలసిధ్ధి తప్పకకలుగుతుంది.ఇది నా విస్వాసమ్.
“సర్వే జనాసుఖినోభవంతి”

watch?v=oCg158CHMokఅన్నమాచార్య  ౬౦౦ శతజయంతి వుత్శవాల సందర్భంగా మేము చేసిన కార్యక్రమాలలో మనసుకి త్రుప్తిని కలిగించిన కర్యక్రమం చెర్లపల్ల సెంట్రలు జైలులో నూతనసంవత్శర సంబరం ఖైదీల కోసం అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమాన్నిజరుపుకోవడం.కార్యక్రమాన్ని సాధించిన సారధి అక్షర అధినేత శ్రీ క్రిష్ణారెడ్డి అయితే,విజయవంతంచేసిన వారువ్యాఖ్యతో చి.శంకర రావు,గాత్రంతో చి.క్రిష్ణారావు,వాయిద్యాలతో శ్రీరమణమూర్తిగారు.శ్రీబ్రహ్మానందం గారు.

మాకు అనుమతి ఒకగంట మాత్రమే.మూడు గంటల కార్యక్రమంజరిగినది.జైలరుశ్రీరమణరావుగారు మాతో పాటు వున్నారు.స్వామి మా అందరిని ఈ విధము గా వుపయోగించినందుకు మాకు కలిగిన అనుభూతి మరిచిపోలేనిది.
భగవంతునితో  భంధాన్ని ఏర్పరచుకొన్నమనిషికి ఒంటరితనంవుండదని,మనసులో వూయలకట్టి బిడ్డగా లాలించగలిగితే,మనసుకి వూరట కలుగుతుందని చెప్పి ” జో అచ్యుతానంద ” కీర్తనతో కార్యక్రమాన్ని ముగించేసరికి,చాలమంది కళ్ళలో నీళ్ళు తుడుచుకుంతున్నారు.
అన్నీవున్నపుడు మనిషికి వాటి విలువతేలియదు,వాటిని పోగోట్టుకున్నపుడుగాని వాటివిలువతెలిసిరాదు.
” నిదురచే కోన్నాళ్ళు,నేరములకొన్నాళ్ళు
ముదిమిచే కోన్నాళ్ళు మోసపోయి
కదిసికోరినను గతకాలంబు వచ్చునే
మదిమదినే వుండి ఏమరకబ్రతుకుటగాక;అని అన్న అన్నమయ్య సందేశం అక్షర సత్యం.

sri venkatesa mama dehi karaavalambam

తాపత్రయం హరవిభో రభసా మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష
మచ్చిష్యమిత్యనుదినమ్ పరిరక్ష విష్నో
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం

ఆనంద మార్గము

మనం అనుకున్నవాటిని పొందడం ఒక భాగ్యమైతే వాటిని ఆనందముగా అనుభవించడము కూడా ఒక సౌభాగ్యమే.ఎన్నివున్నా ఏదోలేదని వున్నదానిని అనుభవించలేకపోవడంఓక దౌర్భాగ్యమ్.మంచి పిల్లలు,చక్కనిజీవితం,ఎవరిని యాచించకుండ,పదిమందికి సాయపడగలిగే స్తితి,ఇవన్నికూడాసంపదలే.కళ్ళు ,కాళ్ళు కలిగివుండడం కూడా మహద్భాగ్యాలే.అవి లేని జీవితాన్ని ఒక్కసారి వూహించుకుంటెమనమెంత అద్ర్స్టష్టవంతులమో తేలుస్తుంది.నిలువెత్తుధనాన్ని ధారపోసినా మనకున్న కళ్ళు,కాళ్ళు ఎవరికీఇవ్వం.అవి ఇచ్చిన భగవంతునికి మనసారా క్రుతజ్నతలు తేలుపకపోతే,మనిషిజన్మకి అర్థంలేదు.

ఆరోగ్యం,ఆనందంవున్న ప్రతిజీవితమూ  భగవత ప్రసాదమే.మనలో చాలామందికి వున్నవాటిని అనుభవించకుండాఐంకా ఏదో లేదని,తామేడుస్తూవేరేవాళ్ళను కూడాఏడిపిస్తూవుంటారు.
జీవితానికి ,మనిషిజన్మకి ఒక అర్థం,ఓక పరమార్థం ,వుండాలి.జీవితంలోని భాధని,భయాన్ని తప్పించుకోడానికి ఒకమంచిమార్గాన్ని ఎంచుకోవాలి.భక్తి,సేవ,ప్రేమ అనే మార్గాలలో దేనిని ఎంచుకున్నా జీవితానికి ఒకపరిపూర్ణతవస్తుంది.ఆనంద మార్గాలు కనిపిస్తాయి.మనకున్నవాటి విలువతేలుసుకోగలిగితే,మనకేదీలేదనే భాధ మాయమౌతుంది.అపురూపమైన జీవితాన్ని ఇచ్చినభగవంతుని గుర్తించగలిగితే కలిగిన ఆనందానికి  గడ్డిపువ్వుకూడా అందంగా కనిపిస్తుంది.ఏమీలేని అభాగ్యులపట్ల ఆప్య్యాయత కలుగుతుంది.జీవితం ఎంత అపురూపమో అనుభవంలోకి వచ్చి,మనలను మంచిమార్గాలవైపు మరలిస్తుంది.
జీవిత అర్థాన్ని గుర్తించి,భక్తిమార్గాన్నిఎంచుకున్న అన్నమయ్య ఆనందం ఈకీర్తన

కలిగే నిదే నాకు కైవల్యము
తోలుతనేవ్వరికి దోరకనిదీ”

జయపురుషోత్తమ, జయపీతాంబర
జయ జయ కరుణాజలనిధి
దయ ఎరంగనే,ధర్మమునెరుగ
క్రియ ఇది నీదివ్యకీర్తనమే”

శరణము గోవింద,శరణముకేశవ
శరణు శరణు శ్రీజనార్ధనా
పరమంబెరుగను,భక్తిఎరుగను
నిరతము నాగతి నీదాస్యమే”
 
అసమాన్యమైన  దాస్యభక్తిని,దానివలనకలిగే మనోల్లాసాన్ని అనుభవించి తరించిన భాగవతోత్తముడు అన్నమయ్య.

annamayya harivennela

Annamayya HariVennela

Annamayya HariVennela

vinarobhagyamu vishnukatha

భక్తి,భావం కలిపితే అది అన్నమయ్య అంతరంగమ్
మనోమాలిన్యాన్ని తోలగించి,వుపశమనాన్ని ఇచ్చేది సంగీతం.
భక్తికి సంగీతం కలిసితే ఏర్పడేది దివ్య సంకీర్తనా ఔషధం.
మానవజీవితాల పాలిటి సంజీవని సంకీర్తన.

చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
రోగాలడచి రక్శిం చే దివ్యౌషధమా”ఆన్నారు అన్నమాచార్యులవారు.పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా అనే కీర్తనలో
నేటి యాంత్రికజీవితాలలో అలసిన మనసుకి వూరట కలిగించ గల శక్తి  ఒక్క భక్తి సంగీతానికే వున్నది
ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించడానికి  ” అన్నారు అన్నమాచార్యులవారు.తాను అనుభవించిన ఆ శక్తిని మనమంతా అనుభవించాలని తన కీర్తనలద్వారా సందేశాన్నిఇచ్చిన మహానుభావుడు అన్నమయ్య.
 ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే,దిక్కుమరిలేదు”
కొరమాలి వున్నవేళ కులము చేడినవేళ
చెరబడి ఒరులచేజిక్కినవేళ
ఒరపైన హరినామం ఒక్కటెగతిగాక,మరచితప్పిననైన మరిలేదు తెరగు”

సంకెలబేట్టినవేళ చంపబిలిచినవేళ
అంకిలిగా అప్పులవారాగినవేళ
వెంకటేశు నామమే విడిపించ గతిగాక మంకుభుద్ది పోరలిన మరిలేదు తెరగు”
ఈఒక్క కీర్తన చాలు మనలను అన్నివేళల కాపాడడానికి

నీ కే శరణు

నీకే శరణు నీవునన్ను కరునించు
ఈకడ నాకడదిక్కు ఎవరున్నారికను
కన్నులచంద్ర సూర్యులు గలవేలుపవు నీవు
పన్నినలక్శ్మీభూమి పతివినీవు
అన్నిట బ్రహ్మకు తండ్రి అయిన ఆదివేలుపవు
ఎన్నగనీ కంటె నేక్కుడెవరున్నారికను”‘

అరసి జీవులకేల్ల అంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చేశ్రీవేంకటెశ
పురుసోత్తముడవు భువన రక్షకుడవు
ఇరవైననీవే గాక ఎవరున్నారికను”‘
భగవంతునిపైన పరిపూర్ణ విశ్వాసం అది.
అన్యధా శరణంనాస్తి, త్వమేవ శరణమ మమ అన్నఎంతమందిని ఆయన కరుణించలేదు?
మన కున్న భాధలకి,మనోవ్యాధులకి మంచిమందు శరణాగతి.
మనసులోని భాధలు,భయాలు భగవంతుని కి  సమర్పించగలిగితే కలిగే మనోబలం మనచుట్టూవందలాది మనుసులున్నా,ఎన్నివేలసంపదలున్నలభిస్తుందా.ప్రార్థనకున్న బలంఅది.
భగవంతునిపై వున్న విశ్వాసమ కలిగించే శక్తి మరే ఆయుధానికైనా వుందా?
మనిషి కి  ,మనసుకి శక్తిని ఇచ్చే వజ్రాయుధమే నిర్మలంగాసాగే మానసిక నివేదన ప్రార్ధన.

Follow

Get every new post delivered to your Inbox.