Latest Entries »

annamayya amrutamaya

ఘనుడాతడెమము కాచుగాక హరి అనిశము మేమిక అతనికే శరణు” ఎవ్వని నాభిని ఈబ్ర్హహ్మాదులు ఎవ్వడు రక్షకుడిన్నిటికి ఎవ్వనిమూలము ఈసచారచరము అవ్వల నివ్వల అతనికేశరణు” పురుషోత్తముడని పోగిడిరేవ్వనిని కరినేవ్వడు గ్రక్కన గాచే ధరనేవ్వడేత్తే దనుజుల పురిగోనే అరుదుగ మేమిక అతనికే శరణు” శ్రీసతి ఎవ్వని చేరివురమునను భాసిల్లెనేవ్వడు పరమంబై దాసుల కోరకై తగు శ్రీవేంకటము ఆశ చూపేనితడు అతనికేశరణు”image

అసలు టపాను చూడండి

ప్రకటనలు

Lakshmi punnammawith cssteam and young volunteersofcharolette

Annamayya keerthana with cssteam

Annamacharya keerthana for asocial cause

http://www.youtube.com/watch?v=1bBC780BW60  

https://lpunnamma.files.wordpress.com/2011/05/copy-of-dsc00895.jpg

హరికీర్తనలో జీవ్తాన్ని గడిపి తరించిన ప్రపన్నుడు అన్నమాచార్యులవారు.
కలియుగ జీవన మార్గంలొ సంకీర్తన సాధనమైతే ..అంతకుమించిన యోగమేమున్నది.అపుడు కైవల్యమార్గాలు కనిపిస్తాయి.మనజీవితమెంత అపురూపమో తెలిసి ,కలిగిన ఆనందం మనకి వున్నత ఆలోచనలు కలిగి మనలను వున్నతశిఖరాలకు చేర్చుతుంది .

పరిశుధ్ధుడైన  ఆత్మశోధకునికి కైవల్యాన్ని అనుగ్రహించె పరమాత్ముడాయన.

తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో పాడే అవకాశం నాకు కలిగినయోగమే .సంకీర్తనా మార్గమే నాజీవన భాగ్యము .
 
నా క్రియ ఇది నీదివ్య కీర్తనమే .

అన్నమయ్య ఆరాధనలో

లక్ష్మీ పున్నమ్మ.

View full article »

ఆత్మ నివేదన

సర్వ సాక్షివి నీవుసర్వాంతరంగుడవు

సర్వంసహాచక్రవర్తి నిర్వాణమూర్తి

నిగమాంత కీర్తి సర్వాపరాధములు క్షమియింపవే”

మనసులోని భాధలు భయాలు భగవంతుని పాదాలకు సమర్పించితే

కలిగే మనోబలం మనచుట్టూ వందలాది మనుషులున్నాకలుగుతుందా

భగవంతునిపై వున్న విశ్వాసం కలిగించే శక్తి మరే ఆయుధానికైనావున్నదా
మనిషికి స్థిత ప్రగ్న్యత కలిగించె ఒకే ఒక ప్రక్రియ నిర్మలముగా సాగే మానసిక నివేదన.అదేప్రార్ధన.
హరి అంటేనెసర్వపాపాలను హరించేవాఆఆడు.ఆమహనీయుడు స్థవనీయుడు ఆరాధనీయుడు.శాంతిని ప్రసాదించె కాంతికిరణాలకు నిలయం హరినామం.
ఆమహనీయునిదర్శించడానికి నిర్మల హ్రుదయముతో ఆత్మనివేదన చేసుకోవడమే వుత్తమమార్గము
అన్నమాచార్యులవారి సాధనామార్గమే మనకూ ఆచరణీయము.
జనన మరణాలను తెలుసుకోలెను నాలోని మంచి చెడులను తెలుసుకోలేను నిన్ను తెలుసుకోవడం నాకుసాధ్యమా.నిన్నువిడువలేను జగద్రక్షకుడవు నన్నునాజీవితంకడవరకు రక్షించు స్వామి అనే ఆత్మనివేదన ఈకీర్తన
దీనుడనేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక

మతి జననమెరుగ మరణంబెరుగను
ఇతవుగనినునిక ఎరిగేనా
క్షితి పుట్టింఛింన శ్రీపతివి నీవు
తతినాపైదయ తలతువు గాక
తడవనాహేయము తడవ నా మలినము
తడయక నీమేలు తలచేనా
విడువలేని శ్రీ వేంకట విభుడవు
కడదాకా నను కాతువుగాక

ఒకసారి ఆపాదాలను ఆశ్రయించించిన భక్తుడు ఆపాదాలు విడిచి మనగలడా.
నాకన్నీ నీవే అన్నఏ భక్తుని ఆయనకాదన్నాడు.శరణాగతిని మించిన భక్తి మార్గము మరిఒకటిలేదు.
అన్నమయ్య జీవితమే ఒకధీర్ఘ శరణాగతి

విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం

అహ మిహ తవ పద దాస్యం అనిశం భజామి.
అన్నమయ్య జయంతి సుభాశీశులతో

అన్నమయ్య ఆరాధనలో
లక్ష్మి పున్నమ్మ
.

http://www.youtube.com/watch?v=BF1mbCnCYtw


     ఈ కీర్తన ఇటీవల విడుదల చేసిన నాఆల్బమ్ సంకీర్తనా  సంజీవని లోనిది.

http://www.youtube.com/watch?v=vUQFIFzrY4c