మనం అనుకున్నవాటిని పొందడం ఒక భాగ్యమైతే వాటిని ఆనందముగా అనుభవించడము కూడా ఒక సౌభాగ్యమే.ఎన్నివున్నా ఏదోలేదని వున్నదానిని అనుభవించలేకపోవడంఓక దౌర్భాగ్యమ్.మంచి పిల్లలు,చక్కనిజీవితం,ఎవరిని యాచించకుండ,పదిమందికి సాయపడగలిగే స్తితి,ఇవన్నికూడాసంపదలే.కళ్ళు ,కాళ్ళు కలిగివుండడం కూడా మహద్భాగ్యాలే.అవి లేని జీవితాన్ని ఒక్కసారి వూహించుకుంటెమనమెంత అద్ర్స్టష్టవంతులమో తేలుస్తుంది.నిలువెత్తుధనాన్ని ధారపోసినా మనకున్న కళ్ళు,కాళ్ళు ఎవరికీఇవ్వం.అవి ఇచ్చిన భగవంతునికి మనసారా క్రుతజ్నతలు తేలుపకపోతే,మనిషిజన్మకి అర్థంలేదు.

ఆరోగ్యం,ఆనందంవున్న ప్రతిజీవితమూ  భగవత ప్రసాదమే.మనలో చాలామందికి వున్నవాటిని అనుభవించకుండాఐంకా ఏదో లేదని,తామేడుస్తూవేరేవాళ్ళను కూడాఏడిపిస్తూవుంటారు.
జీవితానికి ,మనిషిజన్మకి ఒక అర్థం,ఓక పరమార్థం ,వుండాలి.జీవితంలోని భాధని,భయాన్ని తప్పించుకోడానికి ఒకమంచిమార్గాన్ని ఎంచుకోవాలి.భక్తి,సేవ,ప్రేమ అనే మార్గాలలో దేనిని ఎంచుకున్నా జీవితానికి ఒకపరిపూర్ణతవస్తుంది.ఆనంద మార్గాలు కనిపిస్తాయి.మనకున్నవాటి విలువతేలుసుకోగలిగితే,మనకేదీలేదనే భాధ మాయమౌతుంది.అపురూపమైన జీవితాన్ని ఇచ్చినభగవంతుని గుర్తించగలిగితే కలిగిన ఆనందానికి  గడ్డిపువ్వుకూడా అందంగా కనిపిస్తుంది.ఏమీలేని అభాగ్యులపట్ల ఆప్య్యాయత కలుగుతుంది.జీవితం ఎంత అపురూపమో అనుభవంలోకి వచ్చి,మనలను మంచిమార్గాలవైపు మరలిస్తుంది.
జీవిత అర్థాన్ని గుర్తించి,భక్తిమార్గాన్నిఎంచుకున్న అన్నమయ్య ఆనందం ఈకీర్తన

కలిగే నిదే నాకు కైవల్యము
తోలుతనేవ్వరికి దోరకనిదీ”

జయపురుషోత్తమ, జయపీతాంబర
జయ జయ కరుణాజలనిధి
దయ ఎరంగనే,ధర్మమునెరుగ
క్రియ ఇది నీదివ్యకీర్తనమే”

శరణము గోవింద,శరణముకేశవ
శరణు శరణు శ్రీజనార్ధనా
పరమంబెరుగను,భక్తిఎరుగను
నిరతము నాగతి నీదాస్యమే”
 
అసమాన్యమైన  దాస్యభక్తిని,దానివలనకలిగే మనోల్లాసాన్ని అనుభవించి తరించిన భాగవతోత్తముడు అన్నమయ్య.